TG: కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టిందని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు ఏ పంటకు పెట్టుబడి సాయం ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పంటల బీమా అని గొప్పలు చెప్పి, వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులకు రూపాయి కూడా సాయం అందించలేదని విమర్శించారు. రైతులకు రావాల్సిన పాత బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.