BHPL: జిల్లాలో భేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా “సెల్ఫీ విత్ డాటర్” పోటీని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం& 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈనెల 22వ తేదీ లోపు తమ కుమార్తెలతో కలిసి సెల్ఫీ తీసుకొని 9848920828కు వాట్సప్ చేయాలన్నారు.