ASR: అరకులోయలో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినం ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల రంజాన్ ఉపవాస దీక్షలు పూర్తిచేసుకుని శనివారం మసీదు ముఖ్య అధ్యక్షులు గులామ్ హైదర్ అలీ, గురువు హజరత్ రిజ్వీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అరకులోయ ఈద్గా వద్ద ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని ఈద్-ఆల్-ఫితర్ (రంజాన్) శుభాకాంక్షలు తెలుపుకున్నారు.