JN: జనగామ జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను తెలంగాణ రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ మెంబర్ చిలువేరు అభిగౌడ్ కలిశారు. జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు, ఇటీవల రోడ్డు ప్రమాదం నివారణలో భాగంగా పాఠశాలల్లో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులకు సంబంధించిన అంశాలను కలెక్టర్‌కు అభిగౌడ్ వివరించారు.