JGL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా పరిశీలించారు. ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. శాంతి, సామరస్య వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.