PLD: నకరికల్లు మండలం నరసింగపాడులోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో శనివారం రాహుకాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో రాహు-కేతు పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.