దేశవ్యాప్తంగా రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) సంబరాలు ప్రారంభమయ్యాయి. యుద్ధం త్వరగా ముగియాలంటూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ జామా మసీదులో ప్రార్థనలకు వేలాదిమంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈద్ సంబరాలు మొదలయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సపల్ స్టేడియంలో, హైదరాబాద్ మక్కా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేశారు.