TG: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో(BTPS) సాంకేతిక లోపం తలెత్తింది. యూనిట్-2లో బాయిలర్ లీకేజీ ఏర్పడటంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సమాచారం అందుకున్న జెన్కో అధికారులు రంగంలోకి దిగి మరమ్మతు పనులు ప్రారంభించారు. యుద్ధప్రతిపాదికన సమస్యను పరిష్కరించి, గ్రిడ్‌కు ఆటంకం కలగకుండా తిరిగి ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.