KKD: సామర్లకోట కెనాల్ రహదారిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. హుస్సేన్ పురం గ్రామానికి చెందిన నొక్కు రమణ అనే అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా వేట్లపాలెంకు చెందిన ఒక వ్యక్తి బైక్ తో ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదంలో రమణ మృతి చెందగా బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలకు గురైనట్లు తెలిపారు.