ADB: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైనదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు బోధనలో ఉపయోగపడేలా రూపొందించిన కాలసూచిని రాజర్షిషా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. విద్య ప్రమాణాలు, బోధనా పద్ధతులు, బోధన సోపానాలు, వర్తమాన అంశాలు, తదితర అంశాలతో ఈ డైరీ రూపొందించబడిందని పేర్కొన్నారు.