MDK: మెదక్ పట్టణంలో ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక రాసిన ‘ఉగాది పరమార్ధం’ కవితకు విశేష స్పందన లభించింది. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డా. నందిని సిధారెడ్డి చేతుల మీదుగా ఆమె ఉత్తమ కవితా పురస్కారం అందుకోవడంతో పాటు ఆత్మీయ సన్మానం పొందారు.