TPT: తిరుమల శ్రీవారి దర్శనంతరం CM నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక్కరోజు అన్నదానానికి వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని అందించారు. స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.