NLR: రంజాన్ సందర్భంగా నెల్లూరు ముస్లిం సోదరులకు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల శనివారం శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా మసీదులకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.