MBNR: జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి దరఖాస్తులు, భూముల సర్వేపై సమీక్షించిన ఆమె, కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో ఎటువంటి జాప్యం ఉండకూడదని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.