HNK: ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన కల్లుగీతా కార్మికుడు బుధవారం గట్టు రజినీకాంత్ గౌడ్ (48)తాడిచెట్టు పై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. కుల వృత్తి పని చేస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.