HYD: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. మరమ్మతు పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు డిజైన్ల బాధ్యతను ఆప్రీ ఇండియా, ఐఐటీ ముంబయికి అప్పగిస్తూ.. వాటిని కేంద్ర జల సంఘం(CWC) ఆమోదానికి పంపాలని నిర్ణయించారు.