MNCL: తెలంగాణ మున్నూరు కాపు సంఘం జిల్లా ఇంఛార్జ్‌గా మంచిర్యాలకు చెందిన రాష్ట్ర కార్యదర్శి గాదె సత్యం నియమితులయ్యారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ పురుషోత్తమ రావు పటేల్ నియామక పత్రం అందజేశారు. జిల్లాలో మున్నూరు కాపుల అభివృద్ది, సంక్షేమానికి, సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.