WGL: గీసుగొండ(M) మొగిలిచెర్ల గ్రామ శివారులోని SRSP కెనాల్ కాలువలో నిన్న ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ మృతదేహం 3 రోజులుగా కనిపించకుండా పోయిన శాయంపేట (M) గట్లకానిపర్తి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ పూజారి విజయ్ కుమార్ గౌడ్ (45)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.