SRD: సంగారెడ్డి మండలం తాళ్లపల్లి శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.69,000 నగదు, 8 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.