MHBD: మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాలో మహిళపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్చి కోతకు వెళ్తున్న బాధితురాలిని భూక్యా బాలు అనే వ్యక్తి వెంబడించి వేధించగా, ఆమె కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి వద్దకే వెళ్లిన ఎస్సై వీరభద్రరావు ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.