WGL: జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 4,932, బాలికలు 4,560 మంది ఉన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసారు.