MDK: ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసిడర్గా మారాలని జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ‘Arrive-Alive’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత చేపట్టినట్టు వివరించారు.