MBNR: అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి కాంక్షించారు. గురువారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్లో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సంజీవ ముదిరాజ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత ఉన్నారు.