KNR: మహిళలు, యువతులు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాలు నిరంతరం పనిచేస్తున్నాయని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. మే నెలలో 8 క్రిమినల్ కేసులు, 19 పెట్టీ కేసులు నమోదు చేశారు. 70 హాట్స్పాట్లపై నిఘా ఉంచి 35 మంది పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వేధింపులకు గురైతే 8712670759, 100, 112కు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.