ASF: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా సమన్వయకర్త శారద మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, మే 5న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. గురుకుల జూనియర్ కాలేజీ, ప్రతిభా వికాస కేంద్రాలు, సైనిక్ కాలేజీ ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.