MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ స్టేజీ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా, 40 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. గంజాయి తాగుతూ.. తొర్రూరుకు చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీ పట్టుబడ్డారు. గంజాయి విక్రయించే నెల్లికుదురుకు చెందిన సందీప్ పరారీలో ఉన్నారని, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.