MDK: నార్సింగి మండలం సంకాపూర్ తండాలో సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి సర్పంచ్ మహేందర్ సింగ్ భూమి పూజ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. తండా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మిగిలిన హామీలను త్వరలోనే నెరవేరుస్తానని సర్పంచ్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.