SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీ రాజం మాట్లాడుతూ.. చలివేంద్రాన్ని ప్రయాణికులు ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. వేసవి ఎండల దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సమీర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.