సూర్యాపేట: జిల్లా కోదాడ రూరల్ పరిధిలోని ఆడ్లూరు గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గోపాల్ రెడ్డి గ్రామస్తులకు చట్టాలు, మహిళల భద్రత, సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. నేరాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని యువతకు సూచించారు.