ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నె లక్కీ పాల్గొని కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ కర్నె రమేష్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.