KMR: బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాల్ కిషన్ మహిళా దినోత్సవం సందర్భంగా కూరగాయలతో మహిళా చిత్రం వేసి ఆకట్టుకున్నారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమైందని, అందరూ మహిళలను గౌరవించాలని చిత్రం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్‌ను అభినందించారు. గతంలోను పలు వినూత్నంగా చిత్రాలు వేసి ఆకట్టుకున్నారు.