MDK: రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ సంతకాల సేకరణ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో, మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామాయంపేట ప్రాంత అభివృద్ధికి నియోజకవర్గ ఏర్పాటు అనివార్యం అని తెలిపారు.