ELR: దెందులూరు మండలం సోమవరపాడు గ్రామానికి చెందిన తంగేళ్ల లత(20) ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో మనస్తాపానికి గురై ఇంటి వద్దనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ సోమవారం తెలిపారు.