NLR: కోవూరులో రైతుల పండించిన ప్రతి ధాన్యం బస్తాను కొనుగోలు చేస్తామని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు నెల్లూరులోనే ఉండి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. కోవూరు నియోజకవర్గంలో రెండు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.