అన్నమయ్య: ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. రాజంపేటలోని కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు ఆశా కార్యకర్తలు వెన్నుముక లాంటి వారని చెప్పారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారన్నారు.