AP: నంద్యాల జిల్లా కోర్టు ఇంజేడు కృష్ణారెడ్డి హత్య కేసులో 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో పోలీసులు 18 మందిని నిందితులుగా చేర్చారు. 2012 నుంచి ఈ కేసు విచారణ సాగింది. ఈ గ్యాప్లో నిందితుల్లో నలుగురు వివిధ కారణాలతో మరణించారు. మిగిలిన వారిలో 12 మందిపై నేరాలు రుజువు కావడంతో వారికి జీవితఖైదు విధిస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. మరో ఇద్దరిని విడుదల చేశారు.