PDPL: జిల్లాకు చెందిన వరాహగిరి శైలజ, వెంకటరావు దంపతులు తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇంటిని తిరిగి కలెక్టరుకు అప్పగించారు. పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడినందున తమకు ఇల్లు అవసరం లేదని కలెక్టరేట్లో అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని సన్మానించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.