KMM: మేడే కార్మికులు తమ రక్తం చిందించి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం ఒక కాలం పొటుతో రద్దు చేసిందని టీయుసీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి జి రామయ్య అన్నారు. టీయుసీఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు ఖమ్మం బైపాస్ రోడ్లో ఆ పార్టీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించి నాలుగు లేబర్ కోడ్స్ జీవో ప్రతుల్ని దగ్ధం చేశారు.