MDK: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సంజీవరెడ్డి ఉమారాణి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని, పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాల ఉత్పత్తి పెరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్ఏ రాజు, గోపాలమిత్ర శ్రీకాంత్ పాల్గొన్నారు.