WGL: గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV టీకా పంపిణీ జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైనట్లు డీఎంహెచ్ వో డా:సాంబశివరావు తెలిపారు.15 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకాను అందజేయడం కోసం నర్సంపేట, వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రులులో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ టీకా కోసం 9,824 మంది బాలికలను గుర్తించామని పేర్కొన్నారు.