ADB: నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో జోరుగా అభివృద్ధి పనులు జరిపి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ బానోత్ కావేరి అన్నారు. ఆమె ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడారు. గత 15 ఏళ్ళు సర్పంచ్ పాలన చేసిన తండ్రి గజానంద్ నాయక్ ఇచ్చిన మార్గదర్శకాలతో నేడు సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ కావేరి సర్పంచ్ పదవిని దక్కించుకుంది.