AP: రాష్ట్రంలోని మహిళలందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్నామని అన్నారు. ‘సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఎక్కడా వద్దు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలకు వందనం’ అని లోకేష్ పేర్కొన్నారు.