KKD: పిఠాపురం బైపాస్ రోడ్డులో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విరవాడ జంక్షన్ వద్ద బైక్ను తప్పించబోయి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. విద్యుత్ స్తంభం విరిగిపోయినా, పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు గాయపడిన వారిని వెంటనే కాకినాడ ఆసుపత్రికి తరలించారు.