NDL: సమాజంలో తమ హక్కులపై ప్రతీ మహిళ అవగాహన కలిగి ఉండాలని ఆత్మకూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి రాహుల్ అంబేద్కర్ పేర్కొన్నారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు.