ఏలూరు: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను శనివారం కలెక్టర్ వెట్రిసెల్వి తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీసీ కెమెరాలు, బీయూలు, సీయూలు, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేసి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.