MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శనివారం స్వాగతం కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సీనియర్ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడానికి పట్టుదలతో చదివాలని సూచించారు. ఉపాధ్యాయులు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో, సమాజాన్ని సన్మార్గంలో నిలిపే కీలకపాత్ర పోషిస్తారని కొనియాడారు.