అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణం, కుటుంబ వ్యవస్థను నిలబెట్టడంలో మహిళల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి మహిళ తన లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.