SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని చెరువులు, కుంటలు, కాలువల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. నీటి వనరుల వద్ద ప్రజల ప్రాణాలను రక్షించేందుకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.