KMM: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలపై అదనపు భారం పడకుండా శాస్త్రీయ విధానంలో భూముల విలువలను సవరించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2.75 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 5 లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలో రూ. 10 లక్షలు, గా నిర్ణయించినట్లు తెలిపారు.