NZB: కొందరు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. చెట్లను సంరక్షించాల్సిన అధికారులే చోద్యం చూస్తుండడంతో కలప వ్యాపారం జోరుగా సాగుతోంది. అడవుల్లో దొంగచాటుగా చెట్లను మాయం చేస్తున్నారు. అక్రమార్కులు ఆయా ప్రాంతాల్లో పెరిగిన విలువైన చెట్లను యథేచ్ఛగా నరికేస్తున్నారు. కంటికి రెప్పలా అడవిని కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమంగా తరలిపోతూనే ఉంది.